![]() |
![]() |
.webp)
బుల్లితెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వాకి ఇండస్ట్రీలో ఎవరైనా తెలుసు అంటే అది అక్కినేని కుటుంబం అని చెప్పుకోవాలి. అక్కినేని అఖిల్ విశ్వా క్లాస్ మేట్. దీంతో నాగార్జున నిర్మించిన “యువ” సీరియల్ లో విశ్వాకి ఛాన్స్ వచ్చింది. ఇక్కడే నుండే నటుడిగా విశ్వ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా విశ్వ తన మొదటి కొడుకు ర్యాన్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు.
ఇక ఇప్పుడు ఆయన వైఫ్ శ్రద్దా మరో గుడ్ న్యూస్ చెప్పింది. తన యూట్యూబ్ ద్వారా ఒక ప్రాంక్ వీడియో చేసి అందులో విశ్వకి తన సెకండ్ ప్రెగ్నన్సీ గురించి చెప్పింది. కొబ్బరినీళ్లు తాగాలనిపిస్తుందంటూ విశ్వాన్ని కార్ లో ఊరు మొత్తం తిప్పించింది. కొబ్బరి నీళ్లు తాగి పుల్లగా ఉన్నాయని ఆటపట్టించింది. అసలే తాము డాన్స్ ప్రాక్టీస్ షూట్ కి వెళ్లాల్సి ఉండేసరికి శ్రద్ద చేస్తున్న లేట్ కి విశ్వకి కొంచెం కోపం కూడా వచ్చింది. అలా డాన్స్ ప్రాక్టీస్ చేసి వచ్చాక పెద్ద చాక్లేట్ కావాలని మారాం చేసింది. ఎప్పుడూ తనకు చాక్లెట్స్, పువ్వులు తెచ్చివ్వలేదని కంప్లైంట్ కూడా చేసింది. ఫైనల్ గా ప్రెగ్నెన్సీ కిట్ ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చింది.
ఇక అది ఓపెన్ చేసిన విశ్వ ఏడ్చేశాడు. శ్రద్దా కాలేజీ ఎడ్యుకేషన్ కి ఈ ప్రెగ్నెన్సీ అడ్డొస్తాదని భయమేసింది అని చెప్పాడు. కానీ తనకు అమ్మాయి పుడితే బాగుంటుందని తన మనసులో అనుకున్న మాట చెప్పాడు..అమ్మాయి పుడితే కర్లీ హెయిర్ ఉంటే ఇంకా అందంగా ఉంటుందని చెప్తూ ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు.
![]() |
![]() |